సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా ‘సుధీర్స్ జోకర్’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. ‘బిగ్బాస్’ఫేం అయేషా కథానాయికగా పరిచమం అవుతున్న ఈ చిత్రానికి పీఎస్ సునీల్ పుప్పాల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. శనివారం చిత్ర కథానాయిక అయేషా పుట్టినరోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న ‘షాలినీ’ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో షాలినీగా తన నటనతో ప్రేక్షకుల్ని అయేషా అలరిస్తుందని, హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్ షరీఫ్, సంగీతం: లియోన్ జేమ్స్.