Ayalaan | అఫీషియల్.. శివకార్తికేయన్ అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఇదే
Ayalaan | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అయలాన్ (Ayalaan). అయలాన్ చిత్రాన్ని పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.
Ayalaan | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తోంది. అయలాన్ చిత్రాన్ని పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.
తాజాగా టీజర్ అప్డేట్ అందించి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది శివకార్తికేయన్ టీం. తాజాగా అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‌పై నెలకొన్న డైలామాకు తెరదించారు. అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమాలో శివకార్తికేయన్ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
అయలాన్‌లో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నాడు. SK21గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Get ready for lift-off!
Only 10 days until #AyalaanMovie 👽 takes an out-of-this-world experience! 🌌🚀. Hold onto your seats!🌟#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios pic.twitter.com/1VAPmJfW9j
— Ganga Entertainments (@Gangaentertains) January 2, 2024
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

