హైదరాబాద్: ఈ యేటి ఆస్కార్స్‌లో ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు(Naatu Naatu) సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే వేదికపై ఉన్న హోస్ట్ ఆ అవార్డును ప్రకటించగానే.. ఆర్ఆర్ఆర్ టీమ్‌లో సభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఒక్క ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రమే కాదు.. ఆ అవార్డు కోసం పోటీలో ఉన్న ప్రఖ్యాత సింగర్ లేడీ గాగా(Lady Gaga) కూడా ఆ సందర్భాన్ని ఎంజాక్ చేశారు. నాటు నాటుకు ఆస్కార్స్ ప్రకటించగానే.. లేడీ గాగా కూడా లేచి నిలబడి సంతోషంతో చప్పట్టు కొట్టారు.
Lady Gaga cheering for “Naatu Naatu” at The #Oscars pic.twitter.com/w0rxtAIEzT
— Gaga Throwbacks – Fan (@ThrowbacksGaga) March 13, 2023
నిజానికి ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లేడీ గాగా గట్టి పోటీ ఇచ్చారు. టాప్ గన్ మావరిక్(Top Gun Maverick) చిత్రంలో హోల్డ్ మై హ్యాండ్(Hold My Hand) పాట పాడిన లేడీ గాగా కూడా ఆస్కార్స్ కోసం ఎదురుచూసింది. కానీ నాటు నాటుకు అవార్డు ప్రకటించిన సమయంలో లేడీ గాగా ఇచ్చిన రియాక్షన్ అందర్నీ ఆకట్టుకున్నది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బ్లాక్ ప్యాంథర్లో రిహాన్నా(Rihanna) పాడిన లిఫ్ట్ మీ అప్, టెల్ ఇట్ లైక్ ఏ వుమెన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్లోని దిస్ ఈజ్ ఏ లైఫ్ పాటలు కూడా పోటీపడ్డాయి.