Jawan Movie | సినిమాల వసూళ్ల విషయంలో తన రికార్డును తనే బ్రేక్ చేశారు బాలీవుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయన నటించిన ‘పఠాన్’ చిత్రం రూ. 1050 కోట్లు వసూళ్లు చేసి, చరిత్ర సృష్టించింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును మళ్ళీ తానే తిరగరాశాడు షారుఖ్.
షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా రూ.1100 (29 రోజుల్లో) కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్ రూ.1100 కోట్లు. కేవలం హిందీ వెర్షన్ లోనే జవాన్ కి రూ.600కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో దేశీయంగా ఆరువందల కోట్ల రూపాయిల మార్క్ దాటిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.369.90 కోట్లు కలెక్ట్ చేసింది.
Jawan 🤝 Making & breaking box office records every day! 🔥
Book your tickets now!https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r
— Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023
జవాన్ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద బాగానే రన్ అవుతుంది. అలాగే చైనాలో కూడా విడుదలకు సిద్దమౌతుంది. షారుఖ్‌కి చైనాలో మంచి మార్కెట్ వుంది. జవాన్ అక్కడ కూడా హిట్ కొడితే బాక్సాఫీసు ఫైనల్ లెక్క వేరే లెవల్ ఉంటుందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. మొత్తానికి వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలతో తను బాక్సాఫీసు బాద్షా అని రుజువుచేసుకున్నారు షారుఖ్.
జవాన్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది.