అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాప్‌కార్న్’. భోగేంద్ర ప్రసాద్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి గంధం దర్శకుడు. ఫిబ్రవరి 10న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘మది విహంగమయ్యే’ అనే లిరికల్ సాంగ్‌ను కథానాయకుడు నాగచైతన్య విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు సీట్ ఎడ్జ్ మూవీలా వుంటుంది. నేటి యువతకు కూడా కనెక్ట్ అయ్యే అన్ని రకాల ఎమోషన్స్ వున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అవికా గోర్.