Avika Gor | ఎట్టకేలకి పెళ్లి పీటలెక్కబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. వరుడు ఎవరు, ముహూర్తం ఎప్పుడంటే..!
Avika Gor | బాలికా వధూ (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె, తెలుగు సినిమాల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించినప్పటికీ, అనుకున్నంత బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది.
Avika Gor | బాలికా వధూ (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె, తెలుగు సినిమాల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించినప్పటికీ, అనుకున్నంత బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అవికా, ఇప్పుడు జీవితంలో కొత్త అడుగు వేయడానికి సిద్ధమైంది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వాని తో ఆమె పెళ్లి జరగనుంది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్నప్పుడు తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరు, ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది అవికా. వీరిద్దరూ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేడంతో ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా అవికాకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా 2019లో ఓ ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా.
ఇక అప్పటి పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారి , ఆ తరువాత ప్రేమగా మారిందట. అలా దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకి ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతొఓ వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారట. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. అవికాకి ఇప్పుడు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కూడా అవి అంతగా హిట్ కావడం లేదు. ఇక బాలీవుడ్లోనే తన అదృష్టం పరీక్షించుకుంటుంది. మరి పెళ్లి తర్వాత అవికా సినమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

