రిషి, శిల్పనాయక్, తేజు అనుపోజు, శివకార్తిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హనీ ట్రాప్’. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. వీవీ వామనరావు నిర్మాత. ఈ చిత్ర గీతాలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో ఆవిష్కరణ వేడుకకు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి విశ్వసిస్తుంటారు’ అని అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘నా గత చిత్రాల తరహాలోనే సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాను. డబ్బు కోసం కొందరు ఎలాంటి మోసాలకు పాల్పడుతారో ఈ సినిమాలో చూపించాం’ అని తెలిపారు.