Kiran Abbavaram Interview | సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు.. రూల్స్ రంజన్ హీరో కిరణ్ అబ్బవరం చిట్‌చాట్
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు కిరణ్ అబ్బవరం. రూల్స్ రంజన్ విశేషాలు హీరో మాటల్లోనే..
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన రూల్స్ రంజన్ ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్క్రియేట్ చేస్తున్నాయి. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు కిరణ్ అబ్బవరం. రూల్స్ రంజన్ విశేషాలు హీరో మాటల్లోనే..
రూల్స్ రంజన్ ఫాలో అయ్యే రూల్ బుక్ ఏంటి?
దయచేసి టైటిల్‌ను చూసి ఫిక్స్ అవ్వొద్దు. ప్రత్యేకంగా రూల్స్‌కు సంబంధించిందంటూ ఏం ఉండదు. రూల్స్ రంజన్ పక్కా ఎంటర్టైనర్. మా టీం ప్రమోషన్లు మొదలు పెట్టిన రోజు నుండి ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నాను. సినిమా సాగుతున్న 2 గంటల 30 నిమిషాల రన్‌టైమ్ మొత్తం ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని హామీ ఇస్తున్నా.
ఇప్పటిదాకా చాలా కామెడీ సినిమాలొచ్చాయి.. రూల్స్ రంజన్ స్పెషలేంటి..?
తొలిసారి నేను వెన్నెల కిశోర్, హైపర్ ఆదితో కలిసి నటిస్తున్నా. గత సినిమాలన్నీ చాలా వరకు సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌తో సాగేవి.. కామెడీకి ఎక్కువ స్కోప్ లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా వచ్చే కామెడీ సన్నివేశాలతో మీకు తెలియకుండానే పాత్రలతో ప్రేమలో పడిపోయేలా రూల్స్ రంజన్ సాగుతుంది.
సినిమాలో మీ పాత్ర గురించి ఏమైనా చెప్తారా..?
మనో రంజన్ అనే అమాయక టీచర్‌గా కనిపిస్తా. రాజా వారు రాణి గారులో కొంత సాఫ్ట్‌గా కనిపించా. మీ ఇంటి ఆవరణలో చాలా జాగ్రత్తగా, సున్నితంగా, ఆప్యాయంగా పెరిగిన పిల్లలను మీరు చూసి ఉంటారు. అలాంటి జోనర్లోకి వచ్చే వ్యక్తే మనోరంజన్. తనను ఎవరైనా నిందిస్తే ఎలా స్పందించాలో తెలియదు. అతను కొన్ని పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు.. ఎదురువారిని కౌంటర్ చేసేందుకు కొన్ని రూల్స్ పెడతాడు. ఈ లైన్లోనే రూల్స్ రంజన్ క్యారెక్టర్ హైలెట్‌గా అయ్యేలా సాగుతుంది.
మీ చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా, సున్నితంగా, ఆప్యాయంగా పెరిగిన పిల్లలను చూసి ఉంటారు. అలాంటి జోనర్లోకి వచ్చే వ్యక్తే మనోరంజన్. తనను ఎవరైనా నిందిస్తే ఎలా స్పందించాలో తెలియదు. అతను కొన్ని పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు.. ఎదురువారిని కౌంటర్ చేసేందుకు కొన్ని రూల్స్ పెడతాడు. ఈ లైన్లోనే రూల్స్ రంజన్ క్యారెక్టర్ హైలెట్‌గా అయ్యేలా సాగుతుంది.
మీ రియల్ లైఫ్ పాత్రకు మనోరంజన్‌కు ఏమైనా పోలికలున్నాయా..?
చాలా పోలికలుంటాయి. సినిమా షూటింగ్ టైంలో నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన రోజుల్ని గుర్తు తెచ్చుకున్నా. చెన్నైలో పనిచేశా..కానీ అక్కడి భాష తెలియదు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా.. నాకు cafeteria ఎలా ఉంటుందో కూడా తెలియదు. కార్పోరేట్ కల్చర్‌లో నేను ఇమడలేను. సినిమాలో ఈ విషయాలన్నీ చూపించడం జరిగింది.
రుథిరమ్ కృష్ణ స్టోరీకి ఒకే చెప్పడానికి కారణం..?
2021లో రుథిరమ్ కృష్ణను కలిశా. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే విజువల్ కామెడీ డ్రామా అవుతుందని నమ్మి.. కథను ఓకే చేశా. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్‌గా వెన్నెల కిశోర్ కనిపిస్తారు. ఆయనకు, నాకు మధ్య కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలుంటాయి. సుబ్బరాజు, వైవా హర్ష సీన్లు కూడా అందరినీ నవ్విస్తాయి.
సెన్సార్ అప్డేట్..
#RulesRanjann Censored with U/A no cuts. Hilarious fun ride in theaters from 6th Oct #RulesRanjannOnOCT6 💥@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish@AmrishRocks1@DivyangLavania @mkv152013 @rinkukukreja @venupro @starlightenter8 @Tseries @tseriessouth @MythriOfficial pic.twitter.com/JBiWM3DmAv
— BA Raju’s Team (@baraju_SuperHit) September 29, 2023
A new date, but unlimited fun is guaranteed!💥🔥
Get Ready to join the Laughter filled Ride of #RulesRanjann from October 6th 🥳#RulesRanjannOnOCT6@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @DivyangLavania @AmrishRocks1 @mkv152013 @rinkukukreja @venupro @starlightenter8… pic.twitter.com/MdCBJqdLSQ
— Ramesh Bala (@rameshlaus) September 12, 2023
రూల్స్ రంజన్ ట్రైలర్..
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

