కార్తీక్‌రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతలపాటి నరసింహం నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘కేసీపీడీ’ వీడియో సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. కిట్టూ విస్సా ప్రగడ సాహిత్యాన్నందించిన ఈ పాటకు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. గ్రామీణ వాతావరణంలో సహజంగా తెరకెక్కించిన ఆ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని, క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠను పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఇటీవల ఫోరెన్సిక్, క్లూస్ డిపార్ట్మెంట్ వారు తమ సినిమాను వీక్షించి ప్రశంసించారని నిర్మాత పేర్కొన్నారు.