Atharva | కార్తీక్ రాజు (KarthikRaju) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘అథర్వ’ (Atharva). క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మహేష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అథర్వలో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్‌పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి నయా అప్డేట్ అందించారు మేకర్స్. అతి కిరాతకమైన క్రిమినల్ కేసులను చేధించేందుకు అథర్వ రెడీ అవుతున్నాడు.
ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తొలిసారి థియేటర్లలోకి త్వరలోనే వస్తోంది.. అంటూ ట్వీట్ చేశారు. విడుదల తేదీపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రింగా రింగా రోజే (Ringa Ringa Rosey)ను విడుదల చేయగా.. నెట్టింట హల్చల్ చేస్తోంది. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో Peggo Entertainments బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించి థ్రిల్ ను కలిగించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. హీరోయిన్ను ఫాలో అవుతూ హీరో పాడుకుంటున్న రింగా రింగా రోజే సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందని రషెస్ చెబుతున్నాయి. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
#Atharva is set to crack heinous criminal cases
The first-of-its-kind investigative thriller coming soon in theatres
@Imkarthikraju @SimranCOfficial @dirmaheshreddy @SricharanPakala @SubhashNuthala1 @saicharanmadha2 #SBUdhav @mkirangoud @TSeries @PROSaiSatish @ParvathaneniRam pic.twitter.com/McGwCBzXB9— BA Raju’s Team (@baraju_SuperHit) October 19, 2023
రింగా రింగా రోజే సాంగ్ ప్రోమో..