అసిన్ కూతురి ఫొటో చూసి ఆశ్చర్యపోతున్నఫ్యాన్స్

మలయాళీ బ్యూటీ అసిన్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగార్జునతో శివమణి.. పవన్‌తో అన్నవరం.. బాలయ్యతో లక్ష్మీ నరసింహా.. ఇలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోలందరినీ చుట్టేసింది అసిన్. అయితే 2016 జనవరిలో అసిన్ మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మని వివాహం చేసుకుంది.
పెళ్లైన ఏడాదికి అంటే అక్టోబర్24,2017న దంపతులకి అరిన్ అనే కూతురు జన్మించింది. ఈ చిన్నారిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన ఫొటోలని సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది.“వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3 ఇయర్స్ ఓల్డ్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అయితే అరిన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు. అప్పుడే ఇంతలా ఎదిగిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసిన్ చివరగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి “ఆల్ ఈజ్ వెల్”లో కన్పించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

