Ashoka vanamlo arjuna kalyanam | విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సక్సెస్‌ను సాధించిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్. ఎప్పటికప్పుడు కథల పంథాను మార్చుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘ఫలక్‌నుమా దాస్’ వంటి సినిమాతో అటు దర్శకుడిగా ఇటు హీరోగా తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టిన విశ్వక్సేన్, ‘హిట్’ వంటి థ్రిల్లర్ సినిమాతో తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించాడు. ప్రస్తుతం ఈయన ”అశోకవనంలో అర్జున కళ్యాణం’ అంటూ విభిన్న కథతో ప్రేక్షకులను పలకరించాడనికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెండ్లి మూహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇట్లు, అల్లం వారి పెళ్ళి బృందం’ అంటూ వినోదాత్మకంగా విడుదల వాయిదాను మేకర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడిగా రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. బీవిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్విసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Allam's arrival is a lil delayed ⏸️#AshokaVanamLoArjunaKalyanam revises the release date from March 4th!
New Release Date Announcement soon 😊@VishwakSenActor @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/RWzp6vEzDm
— SVCC Digital (@SVCCDigital) March 2, 2022