మెగా అవకాశం
‘అమిగోస్' ‘నా సామిరంగ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కన్నడ భామ ఆషికా రంగనాథ్. తాజాగా ఈ అమ్మడు బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది.
‘అమిగోస్’ ‘నా సామిరంగ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కన్నడ భామ ఆషికా రంగనాథ్. తాజాగా ఈ అమ్మడు బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మూడో సినిమాలోనే మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోవడం అదృష్టమని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
‘విశ్వంభర’ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో ఐదుగురు నాయికలకు చోటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో ఆధ్యాత్మిక, ఫాంటసీ అంశాల కలబోతగా విజువల్ ఫీస్ట్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, రచన-దర్శకత్వం: వశిష్ట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

