దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు చేసింది. రెండేళ్ల విరామం తర్వాత ఈ దర్శకుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రంలో ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. గురువారం వైష్ణవి చైతన్య బర్త్‌డే కావడంతో మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నలుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తోందీ భామ. ‘ఆమె త్వరలో అందించబోయే అద్భుతమైన ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి!’ అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ రివిల్ చేశారు. తాత్కాలికంగా ‘ఎస్వీసీసీ37’ అనే పేరుతో మొదలైన ఈ ప్రాజెక్టులో వైష్ణవి ఓ ముస్లిం అమ్మాయిగా నటిస్తున్నట్టు ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.