Arya’s Captain Movie Trailer | తమిళ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వరుడు’ సినిమాతో ఆర్య తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఆర్య మెప్పించాడు. అప్పటినుండి ఈయన నటించిన సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో డబ్బింగ్ వెర్షన్లుగా విడుదల కాగా మరికొన్ని నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈయన తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఈయన ‘సార్పట్ట పరంపరతో’ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈయన నటించిన ‘కెప్టెన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘శత్రువు ఎవరైనప్పటికి ఎటాక్ చేయడానికి నాలుగు స్టేజెస్ ఉంటాయి’ అంటూ ఆర్య వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో ఆర్య ఆర్మీ అధికారిగా నటించాడు. ఆర్మీ ఆఫీసర్‌గా శత్రువును ఎన్ని రకాలుగా గుర్తించాలి? వారిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను ఆర్య వివరించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. శత్రుదేశాలు మన ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఏలియన్స్ లాంటి జీవులను ఇక్కడకి పంపిస్తారు. ఈ ఏలియన్స్‌ను ఆర్య టీమ్ ఎలా అంతమొందించింది అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఈ చిత్రంలో సీమ్రాన్ కీలకపాత్రలో నటించింది. ఆర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న విడుదల కానుంది. థింక్ స్టూడీయోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నాడు.