Captain Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్య ‘కెప్టెన్’ మూవీ.. రన్ టైం మరీ అంత తక్కువా?
Captain Movie Censor report | తమిళ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఆర్య మెప్పించాడు. అప్పటినుండి ఈయన నటించిన సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో డబ్బింగ్ వెర్షన్లుగా విడుదల కాగా మరికొన్ని నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈయన తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఈయన ‘సార్పట్ట పరంపరతో’ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈయన నటించిన ‘కెప్టెన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం 1 గంటల 56 నిమిషాలుగా ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్ రేట్‌తో ఏ మీడియం రేంజ్ సినిమా కూడా రాలేదు. శత్రుదేశాలు మన ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఏలియన్స్ లాంటి జీవులను ఇక్కడకి పంపిస్తారు. ఈ ఏలియన్స్‌ను ఆర్య టీమ్ ఎలా అంతమొందించింది అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆర్య అర్మీ అధికారిగా కనిపించనున్నాడు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలకపాత్రలో నటించింది. ఆర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది నటించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న విడుదల కానుంది. థింక్ స్టూడీయోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

