Arya Movie | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది ఆర్య. అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం మే 7 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా దర్శకుడిగా సుకుమార్‌కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదలై మంగళవారం నాటికి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్య మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఇక ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా 20 ఏండ్లు కంప్లీట్ చేసుకుంటుందని రీసెంట్గా దిల్ రాజు నాతో అన్నాడు. అయితే ఈ విషయం చెబుతూ.. రీ రిలీజ్ ప్లాన్ చేద్దామా అని అడిగాడు. నేను అప్పుడు రీ రిలీజ్ అనేవి పెద్ద పని.. దానికి టైం కావాలి అన్నాను. దానికి దిల్ రాజు మాట్లాడుతూ.. అయితే ఈవెంట్ ప్లాన్ చేద్దాం అన్నాడు.
మా అందరి కెరీర్లో ఇది లైఫ్ ఛేంజింగ్ సినిమా ఇది. నన్ను స్టార్‌గా మార్చింది. సుకుమార్‌ను పెద్ద దర్శకుడిని చేసింది. దర్శకుడు వి.వి వినాయక్ వల్లనే ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు దేశంలోనే పెద్ద సినిమాలను నిర్మిస్తున్నాడు. మొదట ఈ సినిమా యవరేజ్ అనుకున్నాం. కానీ వారం గడిచిన అనంతరం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతని పాటలు ఆర్యకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంటూ అల్లు అర్జున్ వెల్లడించాడు.