రామానంద్ సాగర్ రూపొందించిన ప్రసిద్ధ టెలివిజన్ సీరియల్ ‘రామాయణ’లో (1987) అరుణ్‌గోవిల్ శ్రీరాముడి పాత్రను పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాభిమానం పొందారు. దశాబ్దాల పాటు ఆయన పేరు శ్రీరాముడి పాత్రతోనే ముడిపడి ఉంది. తాజాగా ఆయన నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో అయోధ్య రాజు దశరథుడి పాత్రలో కనిపించనున్నారు. బుధవారం ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన రాజసం ఉట్టిపడేలా అయోధ్య సింహాసనంపై కనిపిస్తున్నారు.
‘ఒక తరం కోసం ఆయన రాముడి పాత్రకు ప్రాణం పోశారు. ఇప్పుడు అయోధ్య రాజుగా రామాయణ ప్రపంచంలోకి తిరిగి వస్తున్నారు’ అంటూ ఈ పోస్టర్‌పై చిత్రబృందం వ్యాఖ్యానించింది. రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్ 6న తొలి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.