Sonu Sood | ఫ్రాడ్ కేసులో అరెస్ట్ వారెంట్.. స్పందించిన నటుడు సోనూసూద్
Sonu Sood | ప్రముఖ నటుడు సోన్ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Arrest warrant against Sonu Sood | ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood)పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. రూ.10 లక్షల ఫ్రాడ్ కేసులో భాగంగా ఆయనకు కోర్టు నోటీసులు ఇవ్వగా అతడు హాజరుకాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో సోనూసూద్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న వార్తలపై నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ విషయం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరుకావాలని పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు స్పందించారు. అలాగే ఫిబ్రవరి 10న ఈ కేసు విషయంలో మాకు సంబంధం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేయబోతున్నాం. ఇలాంటి వార్తలపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తుంది. ఈ విషయాల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం. దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ సోనూసూద్ రాసుకోచ్చాడు.
లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనను మోహిత్ శుక్లా అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కేసు వేశారు. క్రిప్టోకరెన్సీ అంటూ నమ్మించి నా దగ్గరి నుంచి రూ.10 లక్షలు కాచేశాడంటూ తెలిపాడు. అయితే ఈ కేసులో సాక్ష్యం చెప్పమని సోనూసూద్‌కి కోర్టు సమాన్లు జారీ చేసింది. అయితే సోనూసూద్ ఈ కేసుకు సంబంధించి హాజరుకాకపోవడంతో తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసును ఈ నెల 10కి వాయిదా వేసింది.
We need to clarify that the news circulating on social media platforms is highly sensationalised. To put matters straight, we were summoned as a witness by the Honourable Court in a matter pertaining to a third party to which we have no association or affiliation. Our lawyers…
— sonu sood (@SonuSood) February 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

