Arjun S/O Vyjayanthi| అర్జున్ S/O వైజయంతి టీజర్ విడుదల.. పవర్ ఫుల్ లుక్‌లో విజయశాంతి
Arjun S/O Vyjayanthi| నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్
Arjun S/O Vyjayanthi| నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోంది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి పేరు వైజయంతి కాగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే పేరు పెట్టారు. ఈ మూవీలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గానే కనిపిస్తోంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని వైజయంతి కొడుకు విషయంలో ఏం చేసింది అనే కోణంలో సాగే కథలా సినిమా ఉంటుందని టీజర్‌ని చూస్తే అర్ధమవుతుంది.
10 సంవత్సరాల నా కెరీర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం.. నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నెక్స్ట్ బర్త్ డే నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కొడుకుని కోరుతుంది. కాని లాఠీ చేతపట్టాల్సిన అర్జున్.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టుకొని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్ లో చూపించారు.
టీజర్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు. అయితే హీరోయిన్ ను పూర్తిగా సైడ్ చేశారు. విజయశాంతి చెప్పిన డైలాగ్స్ చూస్తే ఆమెకి కొడుకు అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్స్, సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. ఏది ఏమైన టీజర్ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెంచేసింది. మీరు టీజర్‌పై ఓ లుక్కేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

