20ఏండ్ల పాటు గుర్తుండిపోతుంది
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులను ఎదుర్కొనే సన్నివేశాలతో టీజర్ ఆరంభమైంది.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులను ఎదుర్కొనే సన్నివేశాలతో టీజర్ ఆరంభమైంది. వైజాగ్‌లో నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవడంతో అర్జున్ రంగ ప్రవేశం చేస్తాడు. ఈ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ యాక్షన్ ఘట్టాల్లో భాగమయ్యే అవకాశం దక్కిందని, ఆ సన్నివేశాలన్నీ సహజంగా అనిపిస్తాయని, తన అభిమానులకు ఫుల్మీల్స్లాంటి సినిమా ఇదని విజయశాంతి చెప్పారు.
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “కర్తవ్యం’ సినిమాలో వైజయంతికి కొడుకు పుడితే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్నదే ఈ సినిమా కథ. నా కెరీర్లో ‘అతనొక్కడే’ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అదే తరహాలో ఈ సినిమా కూడా 20ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. స్త్రీమూర్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వారి కోసం మనం ఎలాంటి త్యాగం చేసినా సరిపోదనే సందేశంతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అన్నారు. విజయశాంతిగారు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేద్దామనుకున్నామని, ఆమె అంగీకారంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లిందని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెలిపారు. ఈ సినిమాకు విజయశాంతిగారు ఆయువుపట్టులా నిలిచారని నిర్మాత సునీల్ బలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

