తల్లి కోసం కొడుకు త్యాగమే ఈ సినిమా
‘ఈ సినిమా కోసం ముందు అనుకుంది మామూలు మాస్ కథ. అయితే.. రాస్తున్న క్రమంలో ఓ పవర్ఫుల్ మదర్ కూడా ఉంటే బావుంటుందనిపించింది. ఆ మదర్ కూడా ‘కర్తవ్యం’లో వైజయంతి లాంటి శక్తిమంతమైన పాత్ర అయితే ఇంకా బావుంటుందనిపించింది.
‘ఈ సినిమా కోసం ముందు అనుకుంది మామూలు మాస్ కథ. అయితే.. రాస్తున్న క్రమంలో ఓ పవర్ఫుల్ మదర్ కూడా ఉంటే బావుంటుందనిపించింది. ఆ మదర్ కూడా ‘కర్తవ్యం’లో వైజయంతి లాంటి శక్తిమంతమైన పాత్ర అయితే ఇంకా బావుంటుందనిపించింది. ముందు కల్యాణ్‌రామ్‌కి కథ చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు. కానీ విజయశాంతిగారు తల్లి పాత్రకు ఒప్పకుంటేనే చేద్దాం అని క్లియర్‌గా చెప్పారు. విజయశాంతిగారు ఈ కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా సెట్స్ మీదకెళ్లింది.
’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పారు. ఆయన దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘కథ రీత్యా ఇందులో హీరో పాత్ర, మదర్ పాత్ర రెండూ ఎవరి ఐడియాలజీలో వాళ్లు కరెక్ట్‌గా ఉంటారు.
అక్కడ్నుంచే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. రెండు పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తల్లి కోసం కొడుకు చేసే త్యాగమే ఈ సినిమాకు హైలైట్. తెరపై భావోద్వేగానికి లోనుచేసే అంశమది. ఇందులోని పాత్రలన్నీ కథలో భాగమే. సాంకేతికంగా అభినందనీయంగా సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా చూసి సంతృప్తిగా ఫీలయ్యారు. కల్యాణ్‌రామ్ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది.’ అని ప్రదీప్ చిలుకూరి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

