Thalapathy67 | విజయ్ సినిమాలో కన్నడ సీనియర్ స్టార్ హీరో..!
కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' మూవీ చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Arjun Sarja In Thalapathy67 | కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ మూవీ చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘విక్రమ్’ తర్వాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతుందడటంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. దాంతో లోకేష్ ఈ ప్రాజెక్ట్‌లో అగ్ర నటీనటులను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక పాత్ర కోసం హీరో అర్జున్ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక అర్జున్ కూడా వెంటనే ఓకే చేశాడని టాక్. ఈయనతో పాటుగా లీడర్ ఫేం ప్రియా అనంద్‌ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
రోజు రోజుకు ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడని టాక్. విక్రమ్‌తో విధ్వంసం సృష్టించిన లోకేష్ కనగరాజు.. ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

