తల్లీ కొడుకుల అనుబంధానికి దర్పణం
నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అగ్ర నటి విజయశాంతి కీలక భూమిక పోషించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. తల్లీకొడుకుల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అగ్ర నటి విజయశాంతి కీలక భూమిక పోషించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. తల్లీకొడుకుల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరులో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమాలోని రెండోపాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ముచ్చటగా బంధాలే..’ అంటూ సాగే ఈ పాటను రఘురామ్ రాయగా, అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. హరిచరణ్ ఆలపించారు. అమ్మ స్వభావాన్ని హైలైట్ చేస్తూ రఘురామ్ ఈ పాట రాశారని, కొడుకు విజయం కోసం తపించే తల్లి మనసు ఈ పాటలో ఆవిష్కృతం అయ్యిందని మేకర్స్ తెలిపారు. తల్లీకొడుకుల ప్రేమతోపాటు సాయి మంజ్రేకర్‌తో హీరో రిలేషన్‌ని కూడా ఈ పాటలో చూడొచ్చు. సోహైల్‌ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

