Vijay Devarakonda-Sandeep Reddy Vanga | కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర వయోలెన్స్ సృష్టస్తుంటాయి. అలాంటి సినిమానే అర్జున్ రెడ్డి. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. కానీ ఓ మోస్తరు హిట్టవుతుందలే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా యుఫోరియా చూసి పెద్ద పెద్ద స్టార్లు సైతం షాకయ్యారు. స్టార్ కాస్ట్ లేదు. డైరెక్టర్‌ది డెబ్యూ సినిమా. హీరోకు పెద్దగా మార్కెట్ లేదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఆ నమ్మకమే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అర్జున్ రెడ్డి ముందు వరకు తెలుగు సినిమాలు ఒక మూస ధోరణిలో వెళ్తున్నాయి. తెలుగు సినిమా అంటే ఇదే.. దీన్ని మించి దాటకూడదు అని ఒక గిరి గీసుకుని కూర్చున్నారు.
అదే సమయంలో సందీప్ రెడ్డి అనే వరంగల్ పిల్లగాడు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వచ్చి తెలుగు సినిమా రూపు రేఖలను మార్చేశాడు. మూడు దశాబ్దాల కిందట వచ్చిన శివ టాలీవుడ్ సినిమాలో ఎలా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందో.. ఆరేళ్ల కిందట వచ్చిన అర్జున్ రెడ్డి సైతం అదే స్థాయిలో టాలీవుడ్ గేమ్ చేంజర్‌గా నిలిచింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కల్ట్ క్లాసిక్ అంటూ బిరుదులు పెట్టేశారు. ఇక సందీప్ రెడ్డి విజన్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్లో విజయ్ దేవరకొండ టెర్రిఫిక్ పర్మామెన్స్కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. వీరిద్దరికీ ఈ సినిమా తిరుగులేని పాపులారిటీ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కాంబోలో ఓ సినిమా వస్తే బాగుండు అని ఎందరో ప్రేక్షకులు అనుకున్నారు.
కానీ ఇప్పటివరకు అది కుదరలేదు. ఓ వైపు సందీప్ బాలీవుడ్లో తీరిక లేకుండా గడుపుతుండగా.. విజయ్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. కాగా త్వరలో ఈ కాంబోలో ఓ సినిమా రాబోయే చాన్స్ ఉందని తెలుస్తుంది. తాజాగా మైత్రీ సంస్థ అధినేతల్లో ఒకరైన రవిశంకర్.. సందీప్, విజయ్ దేవరకొండ కాంబో సెట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. దాంతో మ్యూచువల్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. సెట్స్ మీదకు వెళ్లడానికి లేటవ్వచ్చేమో గానీ.. సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా విజయ్ ఇప్పుడు ఆల్రెడీ రెండు ప్రాజెక్ట్‌లను లాక్ చేసుకున్నాడు. అవి పూర్తయ్యే లోపే కనీసం ఏడాదైనా పడుతుంది. మరోవైపు సందీప్ సైతం రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో ఉంచినట్లు తెలుస్తుంది. అందులో స్పిరిట్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక బన్నీతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు కంప్లీట్ అవ్వడానికి ఈజీగా రెండేళ్ల టైమ్ పడుతుంది. కాబట్టి విజయ్, సందీప్‌ల కాంబో సెట్స్ మీదకు వెళ్ళాలంటే కనీసం రెండుఏళ్ళు పడుతుంది. ఇక ఎప్పుడొచ్చినా సినిమా బ్లాక్ బస్టరే అంటూ రౌడీ ఫ్యాన్స్ అప్పుడే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు.