Arjun Rampal : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) పెళ్లి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్(Gabriella Demetriades)తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న అర్జున్.. ఎట్టకేలకు తమ బంధాన్ని శాశ్వతంగా మార్చేసుకున్నాడు. శుక్రవారం ఏమాత్రం హడావిడి లేకుండా గోవాలోని రిజిష్టర్ ఆఫీసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టిందీ జంట. దాంతో.. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సహజీవనంలో ఉంటూ పిల్లల్ని కనడం.. ఆపై పెళ్లి చేసుకోవడం ఈమధ్య మామూలైంది. ఇటీవలే ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన ప్రేయసి, భాగస్వామిని మనువాడగా.. ఇద్దరు పిల్లల తండ్రైన బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా తనతో ఉంటున్న భాగస్వామి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను గోవాలో అతడు మనువాడాడు. శుక్రవారం స్థానిక బర్డెజ్ ఉప రిజిష్టర్ కార్యాలయంలో అర్జున్ రాంపాల్ – గాబ్రియెల్లా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2018 నుంచి కలిసి జీవిస్తున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
Actor Arjun Rampal has married his longtime partner Gabriella Demetriades in Goa, with the couple registering their marriage at the Bardez Sub-Registrar’s Office. The couple, who have been together since 2018, are parents to two sons.#arjunrampal #gabriellademetriades… pic.twitter.com/7l6MTeStkl
— Salar News (@EnglishSalar) August 21, 2026
ఇటీవల రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్ షోలో అర్జున్, గాబ్రియెల్లా తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. అయితే.. రాంపాల్‌కు ఇది రెండో పెళ్లి. ఆంత్రోప్రెన్యూర్ అయిన మెహర్ జెసియాను 1998లో అతడు మనువాడాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా. కానీ, మనస్ఫర్థల కారణంగా ఇద్దరూ 2018లో పరస్పర అంగీకారంతో విడిపోయారు.
2019లో విడాకులకు ముందే రాంపాల్, గాబ్రియెల్లాతో ప్రేమాయాణం మొదలెట్టాడు. ఈమధ్యే ‘ధురంధర్ : ది రివెంజ్’ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన రాంపాల్ .. ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహరాజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2027లొ విడుదల కానుంది.
Arjun Rampal has married his long-time partner Gabriella Demetriades in Goa. The couple registered their marriage at the Bardez Sub-Registrar’s Office after being together since 2018.#DNAUpdates #ArjunRampal #GabriellaDemetriades #Bollywood pic.twitter.com/XLnLpRmAq7
— DNA (@dna) August 21, 2026