Mere Husband Ki Biwi | షూటింగ్లో ప్రమాదం.. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ భర్తకి గాయాలు
Arjun Kapoor | బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Arjun Kapoor | బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor)కి నిర్మాత రకుల్ ప్రీత్ సింగ్ భర్త(Rakul Preet Singh Husband) జాకీ భగ్నానీ(Jackky Bhagnani)కి షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆలస్యంగా వెల్లడించింది.
అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’(Mere Husband Ki Biwi). ఈ సినిమాను రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. షూటింగ్లో సెట్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీకి గాయలు అయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) అధ్యక్షుడు తివారీ స్పందిస్తూ షూటింగ్లో సెట్ పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యిందని.. అదృష్టవశాత్తూ, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు తివారీ తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

