Aishwarya Arjun | పెళ్లి పీటలెక్కనున్న యాక్షన్ కింగ్ కూతురు ఐశ్వర్య.. ప్రకటనే తరువాయి..?
Aishwarya Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) కూతురు ఐశ్వర్యా అర్జున్ (Aishwarya Arjun) సిల్వర్ స్క్కీన్‌పై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
Aishwarya Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) గురించి మూవీ లవర్స్ కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ యాక్షన్ హీరో కూతురు ఐశ్వర్యా అర్జున్ (Aishwarya Arjun) సిల్వర్ స్క్కీన్‌పై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఐశ్వర్యా అర్జున్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
నేషనల్ అవార్డ్ విన్నర్, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో ఉమాపతి రామయ్య (Umapathy Ramaiah)తో ఐశ్వర్యా అర్జున్ రిలేషన్షిప్లో ఉందని, త్వరలోనే ఈ ఇద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారని న్యూస్ హల్ చల్ చేస్తోంది. పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2024లో ఐశ్వర్య-ఉమాపతి పెళ్లి ఉండనుందని ఇన్సైడ్ టాక్.
కాగా దీనిపై అర్జున్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐశ్వర్యా అర్జున్ త్వరలోనే తెలుగు సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

Umapatiramaiah
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

