Arjundas | తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతని కన్నా అతని వాయిస్కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వాయిస్‌లో బేస్ మాములుగా ఉండదు. సింపుల్ డైలాగ్‌ను కూడా తన వాయిస్‌తో వేరే లెవల్‌కు తీసుకెళ్తాడు. రీసెంట్గా వచ్చిన ఓజీ టీజర్లో తన వాయిస్ ఓవర్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇక అర్జున్ దాస్ తాజాగా నటించిన చిత్రం ‘అనీతి’(Aneethi). దుషరా విజయన్ కథనాయికగా నటించింది. ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వసంత బాలన్ దర్శకత్వం వహించాడు. జులై 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా తమిళ్(Aha tamil) లో సెప్టెంబర్ 15న నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కథలోకి వెళితే.. ఈ సినిమాలో అర్జున్ దాస్ డెలివరీ బాయ్ నటించాడు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ఓ డెలివరీ బాయ్ చుట్టూ సినిమా తిరుగుతుండగా… అతడికి చికిత్స సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతను ఆమెతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కలలు కంటాడు, అయితే చివరికి వాళ్లిద్దరూ కలిసారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాలో కాళీ వెంకట్, వనిత విజయకుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Watch #Aneethi⛏❤ Trailer here ▶
Coming Soon on @ahatamil#AneethiOnAha #AneethiComingSoon@Vasantabalan1 #SPictures @shankarshanmugh@gvprakash @iam_arjundas @officialdushara @edwinsakaydop @arjunchdmbrm @UBoyzStudios @thinkmusicindia @vanithavijayku1 @TSivaAmma… pic.twitter.com/vpwxudek7C
— aha Tamil (@ahatamil) September 10, 2023