OG Movie Teaser | ప్రీ లుక్ పోస్టర్‌తో వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేసిన ఘనత సుజీత్కే దక్కింది. పవన్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి. సుజీత్ సైతం అభిమానుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ ఇంట్రోను ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారట. ఫైట్స్ అయితే టాలీవుడ్లో నెవర్ బిఫోర్ అని టాక్.
ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సెట్లోకి కూడా అడుగపెట్టాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఓజీ టీజర్‌కు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మాములుగా అర్జున్‌దాస్ వాయిస్‌కు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన వాయిస్‌లో బేస్ మాములుగా ఉండదు. సింపుల్ డైలాగ్‌ను కూడా తన వాయిస్‌తో వేరే లెవల్‌కు తీసుకెళ్తాడు. అలాంటిది టీజర్‌కు అర్జున్ వాయిస్ అంటే అరాచకమే. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త విని పవన్ ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో ఊగిపోతున్నారు.
ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుందని టాక్. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫార్మ్ కానీ సినిమాపై ఓవర్సీస్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. కేవలం ఓవర్సీస్ హక్కులు దాదాపు రూ.18 కోట్ల రేటు పలుకుతున్నాయట. ఈ లెక్కన పవన్ లాస్ట్ మూవీ భీమ్లానాయక్‌ను డబుల్ మార్జిన్‌తో కొట్టేసినట్లే. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడట. పంజా తర్వాత దాదాపు పన్నెండేళ్లకు మళ్లీ గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తబోతున్నాడు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.