అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, వీరశంకర్, సముద్ర ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా టీమ్ అంతా ఈ సినిమా కోసం ప్రాణంపెట్టి పనిచేశామని, అన్ని వర్గాలను అలరించే కథ ఇదని దర్శకుడు నాగశివ తెలిపారు. తన కుమారుడు అర్జున్ అంబటికి సినిమానే జీవితమని, అతన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని నిర్మాత గణపర్తి నారాయణరావు కోరారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ ఇదని హీరో అర్జున్ అంబటి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: డేవ్ జాండ్.