అర్జున్ అంబటి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. నాగ శివ దర్శకుడు. గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు నిర్మాతలు. ఈ నెల 24న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా దర్శకుడు నాగశివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, అర్జున్ అంబటి నటన, డేవ్ జాండ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సహ నిర్మాత: పులగం సుప్రియ, నిర్మాణం: స్వయంభూ క్రియేషన్స్.