అరియానా అనగానే ముందుగా మనకు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ గుర్తొస్తుంది. ఇటీవల ఈ అమ్మడి పెళ్లి వార్త కూడా తెగ హల్ చేస్తుంది. అయితే ఇక్క పెళ్లి చేసుకుంది అరియానా గ్రాండే. ఈమె పాప్ సింగర్. ఇన్స్టాగ్రామ్లో ఈమెకు 253మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మన బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ పేరు అరియానా గ్లోరీ. గ్రాండే గత వారం కేవలం 20 మంది సమక్షంలో తన ప్రియుడు ఎస్టేట్ డాల్టన్ గోమేజ్ని పెళ్లాడింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరికి షాకిచ్చింది.
గతంలో కమెడియన్ ప్యాట్ డేవిడ్సన్తో అరియానా ప్రేమాయణం సాగించిన కొన్ని కారణాల వలన అతనికి దూరమైంది. ఇక ఎస్టేన్ డాల్టన్తో ఇటీవల విహార యాత్రలకు వెళ్లడం, అతనితో సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేయడం వంటివి చేస్తుంది. గత డిసెంబర్లో నిశ్చితార్థం జరుపుకున్న అరియానా- ఎస్టేట్లు ఎట్టకేలకు పెళ్లి పీటలు కూడా ఎక్కారట. ఇటీవలే వీరు అమెరికాలో ఓ ఖరీధైన ఇంటిని కొనుగోలు చేశారు.