ARI Movie | ‘అరి’ సినిమాకు విడుదల కష్టాలు.. ఇప్పట్లో రిలీజ్ అయ్యేనా?
ARI Movie | సినిమా పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఊహించడం కష్టం. కొన్ని చిత్రాలు వేగంగా షూటింగ్ మొదలై, అలా సులభంగా థియేటర్లలోకి చేరిపోతాయి.
ARI Movie | సినిమా పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఊహించడం కష్టం. కొన్ని చిత్రాలు వేగంగా షూటింగ్ మొదలై, అలా సులభంగా థియేటర్లలోకి చేరిపోతాయి. మరికొన్ని సినిమాలు మాత్రం సంవత్సరాల తరబడి ల్యాబ్‌లోనే ఉండిపోతాయి. వీటిలో కొన్ని సరైన కథనం లేక ఆగిపోతే, మరికొన్ని మాత్రం ప్రత్యేకమైన కంటెంట్, ఎవరూ స్పృశించని విషయాలు, ట్రెండ్‌లో ఉన్న అంశాలు ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి ‘అరి’. ‘పేపర్ బాయ్’తో సూపర్ హిట్ సాధించిన జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు గడిచాయి.
వాస్తవానికి ఈ చిత్రానికి ముందు జయశంకర్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ సిద్ధం చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ లాక్డౌన్ కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో కొంత విరామం తీసుకుని, కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటివరకు ఎవరూ రాని అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకున్నాడు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటీనటులతో ఈ సినిమాను గొప్పగా నిర్మించాడు.
గత ఏడాది ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ ఉద్దేశంతో ప్రమోషన్లు కూడా చేపట్టారు. టీజర్, ట్రైలర్‌తో పాటు మంగ్లీ పాడిన కృష్ణుడి పాటను కూడా విడుదల చేశారు. ప్రచార సామగ్రికి సానుకూల స్పందన లభించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సినిమాకు మద్దతు తెలిపారు.
వెంకయ్య నాయుడు, ‘ఇస్కాన్’ ప్రముఖులు, చిన్న జీయర్ స్వామి, హిందూ సంస్థలు ఈ సినిమాను చూసి చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఇవన్నీ ఏడాది క్రితం జరిగాయి. ఆ సమయంలో సినిమాను విడుదల చేసి ఉంటే, సినిమాకు వచ్చిన ఆసక్తి బాగా ఉపయోగపడేది. కానీ ఏ కారణంతోనో అప్పట్లో విడుదల జరగలేదు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లను మళ్లీ ప్రారంభించారు. నిన్న ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఈ సినిమా థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘భగ భగ..’ అంటూ సాగే ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈసారి కూడా నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించలేదు. ప్రచార చిత్రాలకు మంచి స్పందన, బీజేపీ అగ్ర నాయకుల మద్దతు ఉన్నప్పటికీ, సినిమా ఎందుకు విడుదల కావడం లేదో అర్థం కావడం లేదు.
ఇలాంటి విభిన్న కంటెంట్ ఉన్న సినిమాలను త్వరగా విడుదల చేస్తేనే ఫలితం ఉంటుంది. ఆలస్యమైతే కంటెంట్ పాతబడి, సాధారణ చిత్రంగా మారే ప్రమాదం ఉంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియదా? లేక తెలిసినా విడుదల విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారా? ఏది ఏమైనా, ఆలస్యం అనేది అమృతాన్ని విషంగా మార్చుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

