సెట్స్‌కి వచ్చిన అర్హ.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీం

అల్లు అర్జున్ కూతురు అర్హ సోషల్ మీడియా ద్వారా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ లేదంటే స్నేహా రెడ్డి తరచు అర్హకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండడంతో ఆమెకు ఫుల్ పాపులారిటీ దక్కింది. అర్హ.. అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించడంతో పాటు గీతాంజలి రీ క్రియేషన్ సాంగ్లోను సందడి చేసింది.
తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న అర్హ ఇప్పుడు నటిగా సందడి చేయనుంది. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అర్హ ఎంట్రీ ఖరారు కాగా, ఆ మధ్య సెట్ లో సందడి చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కాగా, అర్హ మళ్లీ సెట్స్ కి వచ్చింది. చిన్నారికి చిత్రబృందం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అల్లు అర్హ ఈ సినిమాలో ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. మొత్తం 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్లో పాల్గొంటుందట. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుండగా మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిచనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- arha
- Shakuntalam
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

