BRO The Avatar | పవన్ కల్యాణ్ బ్రో సినిమాను మిస్సయ్యారా..? అయితే మీ కోసమే ఈ అప్డేట్..
BRO The Avatar | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టైటిల్ రోల్లో నటించిన చిత్రం బ్రో (Bro The Avatar). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రలో నటించారు. జులై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన బ్రో బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
BRO The Avatar | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టైటిల్ రోల్లో నటించిన చిత్రం బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రలో నటించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో మెరిశారు. జులై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన బ్రో బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన బ్రో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. థియేటర్ రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా సందడి చేశాడు బ్రో. అయితే ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా చూడని వారి కోసం ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. బ్రో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది.
అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్ కానుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న బ్రో టీవీ తెరపై అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తుందా..? అనేది చూడాలి. ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషించారు. బ్రో మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. సుజిత్ డైరెక్షన్లో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.
బ్రో టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్..
World Television Premiere#BroTheAvathar
15th Oct, Next Sunday at 6pm on #ZeeTelugu pic.twitter.com/cw9sZZ95aJ— PawanKalyan FC™ (@Legend_PSPK) October 8, 2023
Get ready for spellbound entertainment with timeless #Bro 🤩💥
Watch the World Television Premiere of #BroTheAvatar Coming Soon on #ZeeTelugu#BroTheAvatarOnZeeTelugu@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @peoplemediafcy @MangoMusicLabel… pic.twitter.com/LHPMPZGs0e
— Manohar Royal (@IamManoharRoyal) October 6, 2023
బ్రో వర్కింగ్ స్టిల్స్..
Bro The Avatar1
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

