Yakshini Trailer | కామంతో కాటు వేసే ‘యక్షిణి’.. ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
Yakshini Trailer | బాహుబలితో ఆల్‌టైం బ్లాక్ బస్టర్ అందుకున్న ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks) ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిందని తెలిసిందే. యక్షిణి (Yakshini) అంటూ వెబ్ సిరీస్ రానుండగా.. ఫాంటసీ, కామెడీ, రొమాన్స్ అంశాలతో వస్తున్న ఈ వెబ్ సీరిస్‌కు తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు.
Yakshini Trailer | బాహుబలితో ఆల్‌టైం బ్లాక్ బస్టర్ అందుకున్న ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks) ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిందని తెలిసిందే. యక్షిణి (Yakshini) అంటూ వెబ్ సిరీస్ రానుండగా.. ఫాంటసీ, కామెడీ, రొమాన్స్ అంశాలతో వస్తున్న ఈ వెబ్ సీరిస్‌కు తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓఓటీ ప్లాట్‌ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వేదిక, మంచులక్ష్మి పోస్టర్లు విడుదల చేయగా.. ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
యక్షిణి అనే కామపిశాచి కథల గురించి మనం వినే ఉంటాం.. రాత్రి ఒంటరిగా వెళ్లే మగాళ్లని తన అందచందాలతో లోబరచుకొని తన కోరిక తీరిన అనంతరం చంపేస్తుంది. అయితే ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు పుస్తకాలు రాగా.. తాజాగా వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.
ఇక ఈ మూవీ ట్రైలర్ గమనిస్తే.. మాయ(వేదిక) అనే దేవకన్య మానవుడుతో శారీరక సంబంధం పెట్టుకున్న కారణంగా.. శాపానికి గురి అవుతుంది. ఇక ఈ శాప విమోచనం జరిగి మాయ దేవలోకం వెళ్లాలంటే 100 మంది మగవాళ్ళను తన అందచందాలతో లోబరచుకొని శృంగారంలో ఉన్నప్పుడే చంపాలి. ఈ క్రమంలోనే మాయ ఏం చేసింది అనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ఈ సిరీస్ జూన్ 14 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ని భారీ నిర్మాణ విలువలతో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

