కాశీలో జరిగే ప్రేమకథ
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్'. ఈ చిత్రానికి జయ తీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్’. ఈ చిత్రానికి జయ తీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. నవంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ..‘నటుడు కావాలన్న నా కల ఈ చిత్రంతో తీరుతున్నది. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత తిలక రాజ్ బల్లాల్‌కు కృతజ్ఞతలు. మంచి ప్రేమ కథా చిత్రమిది. సకుటుంబంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది’ అన్నారు. దర్శకుడు జయ తీర్థ మాట్లాడుతూ..‘బలమైన కథా కథనాలు, ఉన్నత సాంకేతిక విలువలతో మంచి అనుభూతిని పంచే చిత్రాన్ని రూపొందించాం. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, కన్నడ హీరో రవిచంద్రన్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

