అర్హతలేని సినిమాల్ని ఆస్కార్‌కు పంపిస్తున్నారు
భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ చేసే సినిమాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. అర్హత లేని చిత్రాల్ని ఆస్కార్‌కు పంపించడం వల్ల అవార్డులకు నోచుకోలేకపోతున్నామని ఆయన విమర్శించారు. సంగీత దిగ్గజం ఎల్.సుబ్రహ్మణ్యంతో తన యూ ట్యూబ్‌లో ఛానల్లో మాటామంతీ నిర్వహించారు ఏ.ఆర్.రెహమాన్. ఈ కార్యక్రమంలో తన సంగీత ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారాయన.
భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ చేసే సినిమాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. అర్హత లేని చిత్రాల్ని ఆస్కార్‌కు పంపించడం వల్ల అవార్డులకు నోచుకోలేకపోతున్నామని ఆయన విమర్శించారు. సంగీత దిగ్గజం ఎల్.సుబ్రహ్మణ్యంతో తన యూ ట్యూబ్‌లో ఛానల్లో మాటామంతీ నిర్వహించారు ఏ.ఆర్.రెహమాన్. ఈ కార్యక్రమంలో తన సంగీత ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారాయన. ఈ నేపథ్యంలో ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసే సినిమాల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై రెహమాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘భారత్ నుంచి చాలా చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచి వెనక్కి వస్తున్నాయి. అర్హత లేని చిత్రాల్ని ఎంపిక చేస్తున్నందు వల్లే అలా జరుగుతున్నది. ఈ విషయంలో మనం చూస్త్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం’ అని అన్నారు. ఇటీవల ప్రకటించిన ఆస్కార్ పురస్కారాల్లో ‘నాటు నాటు’ పాటతో పాటు ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ చిత్రం భారత్ నుంచి ఆస్కార్ పురస్కారాల్ని గెలుచుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’కు మద్దతుగా, ఆ చిత్రాన్ని అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ చేస్తే బాగుండేదనే కోణంలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 2009లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికిగాను ఏ.ఆర్.రెహమాన్ రెండు ఆస్కార్ పురస్కారాల్ని గెలుచుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ar rahman
- India
- India movies
- oscars
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

