A.R Murugadoss-Vikram | ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో ‘చియాన్’ విక్రమ్?
A.R Murugadoss-Vikram Movie | విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే నటుడు విక్రమ్. పేరుకు అరవ హీరోనే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు విభిన్న వేరియేషన్లను చూపిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్టులేని విక్రమ్‌కు ‘మహాన్’ మంచి కంబ్యాక్ ఇచ్చింది. అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ కీలకపాత్రలో నటించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన స్టార్ దర్శకుడితో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.
సందేశాత్మక సినిమాలకు కమర్షియల్ అంశాలను జోడించి మంచి విజయాలను సాధిస్తుంటాడు ఏఆర్.మురుగుదాస్. ఇప్పుడంటే ఈయన సినిమాలు ఉప్పులేని పప్పు చారులా ఉన్నాయి గాని, అప్పట్లో ఈయన సినిమాలు హైదరాబాద్ దమ్ బిర్యాని కంటే స్పైసీగా ఉండేవి. కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు ఉంటే చాలు చాలా మంది సినీఅభిమానులు థియేటర్లకు పరుగులు తీసేవారు. అయితే తాజాగా ఈయన విక్రమ్‌కు ఓ కథ వినిపించాడట. విక్రమ్‌కు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఏఆర్ మురుగుదాస్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
విక్రమ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కోబ్రా’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మే 25న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. వీటితో పాటుగా ‘ధృవ్ నచ్చితరమ్’ గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇక పా. రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

