Telugu Movies | ఏప్రిల్ రెండోవారం సినీ ప్రియులకు పండగే.. ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే
April Second Week Theater/Ott Releases | గతవారం బాక్సాఫీస్ దగ్గర చప్పగా సాగింది. భారీ హైప్‌తో రిలీజైన 'రావాణాసుర' మొదటి రోజే తుస్సుమంది. టాక్ మరీ దారుణంగా లేకపోయినా.. ఏ రేటెడ్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
April Second Week Theater/Ott Releases | గతవారం బాక్సాఫీస్ చప్పగా సాగింది. భారీ హైప్‌తో రిలీజైన ‘రావాణాసుర’ మొదటి రోజే తుస్సుమంది. టాక్ మరీ దారుణంగా లేకపోయినా.. ఏ రేటెడ్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా రవితేజ అలాంటి క్యారెక్టర్ చేయడంతో కొంత మంది పెదవి విరిచారు. అయితే చాలా మంది సినిమా చూసిన వాళ్లు రవితేజ నెగెటీవ్ క్యారెక్టర్లో కుమ్మేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక అదే రోజున విడుదలైన ‘మీటర్’ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో తొలిరోజే జెండా ఎత్తేసింది. దాంతో కిరణ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిపోయింది. అయితే ఈ వారం మాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి సినిమాలు ముస్తాబవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం.
శాకుంతలం:

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి హైప్‌నే క్రియేట్ చేశాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శాకుంతల పాత్రలో సమంత నటించగా.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.
రుద్రుడు:

లారెన్స్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కోట్లు కొల్లగొడతాయి. హార్రర్ సినిమాలతో తిరగులేని ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న లారెన్స్ చాలా కాలం తర్వాత ఆ జానర్ నుంచి బయటకు వచ్చి రుద్రుడు వంటి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. కథిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల పార్ట్-1:

గతనెలలో తమిళంలో రిలీజై కోట్లు కొల్లగొట్టిన విడుదల పార్ట్-1 సినిమాను గీతాఆర్స్ట్ బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేస్తుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్కడలేని అంచనాలు నెలకొల్పింది. సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా:

దాస్ కా ధమ్కీ-ఏప్రిల్14
అమెజాన్:

ది మార్వెలస్ మిస్సెస్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 14
కబ్జా-ఏప్రిల్ 14
నెట్‌ఫ్లిక్స్:

ఫ్లోరియా మాన్(వెబ్ సిరీస్)-ఏప్రిల్ 13
అబ్సెషన్(వెబ్ సిరీస్)-ఏప్రిల్ 13
క్వీన్ మేకర్(కొరియన్ సిరీస్)- ఏప్రిల్14
ది లాస్ట్ కింగ్డమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 14
జీ5:

మిస్సెస్ అండర్‌కవర్(హిందీ)-ఏప్రిల్ 14
డిస్నీ హాట్‌స్టార్:
ఓ కల(తెలుగు)- ఏప్రిల్ 13
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

