Nara Lokesh | దేశవ్యాప్తంగా ప్రస్తుతం భాష వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడయితే నూతన విద్యా విధానం (NEP 2020) పిల్లలకు బలవంతంగా హిందీ రుద్దాలని చూశారో అప్పటినుంచి ఈ వివాదం మెల్లిమెల్లిగా పాకుతూ వస్తుంది. ఇంతకుముందు వరకు కేవళం తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ గొడవలు ఆ తర్వాత కర్నాటక, మహరాష్ట్ర, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వరకు పాకాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష పెద్దమ్మ అని సంబోధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీ భాషకి మద్దతుని తెలపడంతో ఈ వివాదానికి మరింత చర్చను లేపింది.
ఇదిలావుంటే రీసెంట్గా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నారా లోకేష్ హిందీ మన జాతీయ భాష అంటూ నోరు జారాడు. ఒకవైపు యాంకర్ హిందీ జాతీయ భాష కాదని చెబుతుండగానే నారా లోకేష్ వెంటనే దాన్ని ఖండించి, హిందీ జాతీయ భాష అని గట్టిగా నొక్కిచెప్పాడు. దీంతో ఈ విషయంపై నెటిజన్లు లోకేష్‌కి గట్టిగా క్లాస్ పీకుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీ అధికార భాషల్లో ఒకటి మాత్రమే, అది జాతీయ భాషగా ప్రకటించబడలేదు. అలాగే దేశంలో 22 అధికార భాషలుండగా.. రాజ్యాంగంలో ఏ భాషకూ ‘జాతీయ భాష’ హోదా ఇవ్వబడలేదు.
చవట దద్దమ్మ! ఎదురుగా హిందీ ఆమె, హిందీ జాతీయ భాష కాదని చెబుతున్నా, అవునని దబాయుస్తన్నావు…. ఏ మొకం పెట్టుకుని మినిస్టరని చెప్పుకుంటావు….
మీ తాత బ్రతికి ఉంటే, చెంప మీదోటి చాచి కొట్టేను..
మాతృభాషలో చదువులుపెట్టే దమ్ము లేదు కానీ హిందీ, హిందీ అంట హిందీ, వెధవ బతుక్కి…. https://t.co/OPyXAzmwV7
— చుక్కసుబ్బపున్నమ్మ (@esalpana) July 14, 2025
తప్పు మాట్లాడడం కాక, ఆ యాంకర్ సరి చేస్తున్నా వినకుండా, వాదించడం ఏదైతే ఉందో.. https://t.co/rnlIHl8qAo
— Balla Satish-బళ్ల సతీశ్ (@ballasatish) July 15, 2025
Potthulo unnanni rojulu adhe thammullu https://t.co/wT8klL1z9m
— ☭ YASHWANTH ⚫💊 (@Punker_434) July 14, 2025