Butterfly Movie On OTT | ఓ వైపు గ్లామర్ పాత్రలను చేస్తూ.. మరో వైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి అనుపమ పరమేశ్వరణ్. ‘అఆ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ బ్యూటీ అనతికాలంలో వరుస సినిమాలలో నటిస్తూ టైర్2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బటర్‌ఫ్లై’ ఒకటి. మహిళా ప్రధాన సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి గంటా సతీష్ బాబు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతుందని టాక్. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం చిత్రయూనిట్ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌తో మేకర్స్ ఇప్పటికే చర్చలు కూడా జరిపారట. మేకర్స్‌కు హాట్‌స్టార్ సంస్థ భారీ ధర ఆఫర్ చేసిందట. దాంతో మేకర్స్ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మించారు.