ఆమిర్ వలనే మా అన్నయ్య చనిపోయాడు: అనుపమ్ సోదరుడు

మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో సత్య, దిల్ సే, లగాన్ లాంటి హీట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు అనుపమ్ శ్యామ్. కిడ్నీ ఇన్పెక్షన్, పలు అవయవాల ఫెయిల్యూర్ సమస్యలతో అనుపమ్ శ్యాం ముంబై నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై బాలీవుడ్ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. అయితే తన అన్నయ్య మృతికి ఆమిర్ కారణం అంటూ అనుపమ్ శ్యామ్ సోదరుడు అనురాగ్ శ్యామ్ సంచలన కామెంట్స్ చేశాడు.
స్థానిక మీడియాతో మాట్లాడిన అనురాగ్.. నా అన్నయ్య ఆరోగ్యం క్షీణించిన సమయంలో మా తల్లి కూడా చనిపోయారు. దాంతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. డయాలసిస్ కోసం డబ్బులు కావాలని ఇండస్ట్రీలో అందరికి అన్నయ్య ఫోన్ చేశారు. ఆమిర్ కి చేసినప్పుడు మొదట తమకు సాయం చేస్తానని, పర్సనల్ లోన్ ఇప్పిస్తానని కూడా హామి ఇచ్చారు. తర్వాత ఫోన్ ఎత్తనే లేదు. ఆయనని కలిసే ఛాన్స్ కూడా దొరకలేదు.మెసేజ్ చేశాం రిప్లై రాలేదు.
ఒకవేళ ఆమిర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు అన్నయ్య(అనుపమ్ శ్యామ్) మన మధ్యే ఉండేవారు. నమ్మిన వారు కూడా సాయం చేయకపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. ఈ రోజు మా మధ్య అన్నయ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. కాగా అనుపమ్ శ్యామ్ ఆమిర్ ఖాన్ ‘లగాన్’ , ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలలో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aamir Khan
- Anupam Shyam
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

