Anu Emmanuel | షాక్‌లో అనూ ఇమ్మాన్యుయేల్.. ఆసక్తి రేకెత్తిస్తోన్న Boomerang ఫస్ట్ లుక్
Anu Emmanuel | మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel). ఈ యూనెటెడ్ స్టేట్స్ భామ పాపులర్ సినిమాటోగ్రఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బూమరాంగ్ (Boomerang) టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Anu Emmanuel | మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel). తెలుగులో గోపీచంద్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ యూనెటెడ్ స్టేట్స్ భామ పాపులర్ సినిమాటోగ్రఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బూమరాంగ్ (Boomerang) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
చీకట్లో ఉన్న ఓ ఇంటి ముందు డెడ్‌బాడీలు కనిపిస్తుండగా.. ఓ వ్యక్తి వాటి మధ్యలో నుంచి కుక్కను పట్టుకుని వస్తుండటం చూడొచ్చు. మరోవైపు అనూ ఇమ్మాన్యుయేల్ షాకింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఈ సారి ఏదో సస్పెన్స్ స్టోరీతో పక్కా హిట్ కొట్టేందుకు రెడీ అవుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రంతో ఆండ్రీవ్ బాబు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆండ్రీవ్ బాబు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం.
యూనిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో శివ కందుకూరి లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తున్నారు. సితార ఫిలిమ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్ పనులు చూసుకోనుంది.
రెండు స్టోరీ లైన్స్ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. లండన్‌లోని అందమైన లొకేషన్లలో కొనసాగుతోంది. ఆండ్రీవ్ బాబు రామ్ నటించిన కందిరీగ, ఎందుకంటే ప్రేమంటే, సాయి దుర్గ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేశాడు. గతేడాది రవితేజతో కలిసి నటించిన రావణాసుర, కార్తీతో నటించిన జపాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది అనూ ఇమ్మాన్యుయేల్.
Boomerang ఫస్ట్ లుక్..
Presenting the thrilling title & first look of #BigMovieMakers and @My3Arts Production No. 1 ~ 𝘽𝙊𝙊𝙈𝙀𝙍𝘼𝙉𝙂 💥
⭐️ing @ItsAnuEmmanuel, @iam_shiva9696
Directed by @iandrewdop
Music by @anuprubens
Produced by @Londonganesh & @DrVootla98317@harshachemudu #SitharaFilmsLtd pic.twitter.com/hXsd2EvgWe— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2025
Read Also :
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

