Dhanraj | డైరెక్టర్‌గా మారబోతున్న మరో కమెడియన్.. క్రేజీ అప్డేట్ వివరాలివే..!
Dhanraj | వేణు యెల్దండి (Venu Yeldandi) బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారాడని తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. వేణు యెల్దండి రూట్లోనే మరో కమెడియన్ కూడా వెళ్లబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Dhanraj | జబర్దస్త్ షోతోపాటు సినిమాలతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు యెల్దండి (Venu Yeldandi). ఈ టాలెంటెడ్ కమెడియన్ బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారాడని తెలిసిందే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. వేణు యెల్దండి రూట్లోనే మరో కమెడియన్ కూడా వెళ్లబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనే కదా మీ డౌటు.
ఇతడు కూడా జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన ధన్‌రాజ్ (Dhanraj ). ఈ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు సినిమాల్లో కూడా నటించాడని తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ధన్‌రాజ్ విలేజ్ డ్రామా (Village Drama) నేపథ్యంలో రాబోయే సినిమాతో డైరెక్టర్‌గా మారబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏపీ బ్యాక్‌డ్రాప్‌లోని ఓ గ్రామం చుట్టూ తిరిగే ఎమోషనల్ కథాంశంతో సినిమా ఉండబోతుందట. దసరా సందర్భంగా సినిమా గ్రాండ్‌గా లాంచ్ కాబోతుందని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. వేణు యెల్దండి కూడా విలేజ్ నేపథ్యాన్ని తీసుకొని బలగం సినిమా చేశాడని తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్‌గా వేణుకు ఎంట్రీతోనే గ్రాండ్ సక్సెస్ అందించింది. పలు క్రేజీ ఆఫర్లు కూడా వేణు తలుపు తట్టేలా చేసింది బలగం. మరి ధన్‌రాజ్ తీయబోతున్న సినిమా డైరెక్టర్‌గా అతడికి ఎన్ని మార్కులు తెచ్చిపెడుతుందో చూడాలంటున్నారు సినీ లవర్స్. దర్శకుడిగా అదృష్టం పరీక్షించుబోతున్న ధన్‌రాజ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
బలగం ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

