Annu Kapoor | ఇంటిమేట్ సీన్స్‌పై అన్ను కపూర్ సంచలన వ్యాఖ్యలు.. ‘కట్’ చెప్పినా హీరోలు ఆగరు!
Annu Kapoor |సినిమా ఇండస్ట్రీలో ఇంటిమేట్ సీన్స్ (శృంగార సన్నివేశాలు) చిత్రీకరణపై సీనియర్ నటుడు అన్ను కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెట్స్‌లో కొందరు హీరోలు ఉద్దేశపూర్వకంగానే నియంత్రణ కోల్పోయి, నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది.
Annu Kapoor |సినిమా ఇండస్ట్రీలో ఇంటిమేట్ సీన్స్ (శృంగార సన్నివేశాలు) చిత్రీకరణపై సీనియర్ నటుడు అన్ను కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెట్స్‌లో కొందరు హీరోలు ఉద్దేశపూర్వకంగానే నియంత్రణ కోల్పోయి, నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అన్ను కపూర్, షూటింగ్ సమయంలో తాను ప్రత్యక్షంగా చూసిన ఒక ఘటనను వివరించారు. “ఒక ఇంటిమేట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో హీరో అత్యుత్సాహంతో ప్రవర్తించాడు. డైరెక్టర్ ‘కట్’ అని చెప్పిన తర్వాత కూడా అతను ఆగకుండా హీరోయిన్ను వదలకుండా వేధించాడు. ఆ హీరోయిన్ అతని నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడింది. ఆ సంఘటన ఆమెను అంతగా కలచివేసింది, రెండు రోజుల పాటు తన గదిలోనే ఉండిపోయింది అని ఆయన వెల్లడించారు. అయితే ఆ నటీనటుల పేర్లను మాత్రం బయటపెట్టలేదు.
ఇక 7 ఖూన్ మాఫ్ సినిమా సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కూడా అన్ను కపూర్ గుర్తుచేశారు. ఈ చిత్రాన్ని విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియాంక చోప్రాతో ఒక కిస్సింగ్ సీన్ చేయాల్సి ఉండగా, ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపారు. దర్శకుడు ఆ సీన్ కథలో భాగమని చెప్పినా, ప్రియాంక కంఫర్టబుల్‌గా లేనని చెప్పింది. నేను కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అందంగా లేనందువల్లే ఆమె నాతో ఆ సీన్ చేయలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ నా స్థానంలో పెద్ద స్టార్ హీరో ఉంటే ఆమె అలా అనేది కాదేమో అని అన్ను కపూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇలాంటి సన్నివేశాల్లో తాను ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. నా తోటి నటీమణి కంఫర్ట్ నాకు చాలా ముఖ్యం. ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తే నేను వెంటనే అర్థం చేసుకుంటాను. సెట్లో పరస్పర గౌరవం ఉండాలి. కానీ కొందరు కావాలనే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బి 3లో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో కలిసి నటించిన అన్ను కపూర్ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రియదర్శన్ తెరకెక్కించనున్న కొత్త కామెడీ డ్రామాలో నటించబోతున్నారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, సౌరభ్ శుక్లా వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Annu Kapoor
- bollywood
- heoines
- hero
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

