అన్నీ మంచి శకునములే
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ నిర్మిస్తున్నాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ నిర్మిస్తున్నాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. మే 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిజమేది..రుజువేది..’ అని సాగే టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పాటను మిక్కీ జే మేయర్ స్వరపర్చగా…రెహ్మాన్ సాహిత్యాన్ని అందించారు. కార్తీక్ ఆలపించారు.
దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ…‘నటీనటులు, సాంకేతిక నిపుణులమంతా మనసు పెట్టి చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. సకుటుంబంగా చూసేలా ఆహ్లాదకరంగా ఉంటుంది’ అని చెప్పింది. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ…‘ మా స్వప్న సినిమా స్థాపించిన తర్వాత మాకన్నీ మంచి శకునములే ఎదురయ్యాయి.
‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి మొదలై ఈ సంస్థ వరుసగా ఐదు విజయాలు అందుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం సులువు కానీ కొత్త వాళ్లతో ఆకట్టుకునే కథ కథనాలు, మంచి సంగీతంతో సినిమాలు నిర్మించి విజయాలు సాధించడం నిజమైన సక్సెస్‌గా భావిస్తా. నా బిడ్డలు ఈ సినిమాతోనూ అలాంటి సక్సెస్ అందుకోవాలి’ అన్నారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ…‘నందినీరెడ్డి దగ్గర నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. స్వప్న అక్క నిర్మాణంలో పనిచేయడంతో నా కల తీరింది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

