Anni Manchi Sakunamule Teaser | టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’తో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ నాలుగేళ్లకు ‘తాను నేను’ సినిమాతో హీరో అవతారమెత్తాడు. తొలి సినిమానే డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘పేపర్ బాయ్’ వంటి న్యూఏజ్ లవ్‌స్టోరీతో వచ్చాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్ లభించిన కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. దాంతో మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఏక్ మినీ కథ’ వంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి ఆధరణ వచ్చింది.
సంతోష్ శోభన్ పేరు కాస్తో కూస్తో జనాలకు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫ్లాపులు పలకరించాయి. దాంతో సంతోష్ మార్కెట్ అమాంతం పడిపోయింది. రొటీన్ కథలతో వస్తూ జనాలకు కూడా బోర్ కొట్టేశాడు. ప్రస్తుతం సంతోష్ ఆశలన్ని ‘అన్ని మంచి శకునములే’ సినిమాపైనే ఉన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్ సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ కాస్త ఆసక్తి పెంచుతుంది. సినిమా గురించి టీజర్లో ఎక్కువగా ఏమి రివీల్ చేయలేదు కానీ, కాస్త ఎమోషనల్ రైడ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. బలాదూర్‌గా తిరిగే హీరో, ఇంటి బాధ్యతను మీదేసుకున్న హీరోయిన్, వేరు వేరు స్వభావాలున్న వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఫ్యామిలీ బంధాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే చివర్లో జీప్ యాక్సిడెంట్ కాస్త టీజర్‌పై క్యూరియాసిటీ పెంచింది. మొత్తంగా టీజర్ చూస్తుంటే మంచి శాఖాహార భోజనంలా అనిపిస్తుంది. మరీ ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ గట్టెక్కుతాడో లేదో చూడాలి.
ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది.