Anni Manchi Sakunamule Movie | సంతోష్ శోభన్‌కు ఈ సారి కూడా నిరాశే మిగిలింది..!
Santhosh Sobhan | రంగు, రూపం, నటన మూడు పుష్కలంగా ఉన్నా.. సంతోష్ శోభన్‌కు అదృష్టం మాత్రం ఆవగింజంత కూడా లేకుండా పోయింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్లు మూట గట్టుకున్నాయి.
Santhosh Sobhan | రంగు, రూపం, నటన మూడు పుష్కలంగా ఉన్నా.. సంతోష్ శోభన్‌కు అదృష్టం మాత్రం ఆవగింజంత కూడా లేకుండా పోయింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్లు మూట గట్టుకున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన ఏక్ మినీ కథతో సంతోష్ కాస్త లైమ్‌లోకి వచ్చాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫ్లాపులు పలకరించాయి. పైగా అన్నీ పేరున్న సంస్థలలోనే సంతోష్ శోభన్ సినిమాలు చేశాడు. కానీ హిట్లు మాత్రం వరించడం లేదు.
మారుతి వంటి స్టార్ డైరెక్టర్ చేతిలో పడ్డ.. సంతోష్‌కు లక్కు మాత్రం కలిసి రాలేదు. వరుస హిట్లున్న మేర్లపాక గాంధీ కూడా సంతోష్‌కు హిట్టివ్వలేకపోయాడు. ఆ తర్వాత కళ్యాణం కమనీయం కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. గతేడాది వచ్చిన శ్రీదేవి శోభన్‌బాబు మూవీ విడుదలైన విషయమే సగం జనాలకు తెలియలేదు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న నందిని రెడ్డితో అన్ని మంచి శకునములే సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి హైప్‌నే క్రియేట్ చేశాయి.
తీరా రిలీజయ్యాక మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇక తొలిరోజు కనీసం కోటి షేర్ కూడా సాధించలేకపోయింది. రెండో రోజు పరిస్థితి కూడా అంతే ఉంది. బుకింగ్స్ కూడా ఏమంత భారీ స్థాయిలో లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా సంతోష్‌కు నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం సంతోష్ ప్రేమ్ కుమార్ అనే రోమ్ కామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయినా సంతోష్ ఫ్లాపులకు బ్రేక్‌లు వేస్తుందో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

